నిజందాగదుక్షణంఆగదు

Apr 11 2024, 21:12

నల్లగొండ: మునుగోడు రోడ్డు ఈద్గా దగ్గర ప్రార్థనలకు విచ్చేసిన మైనార్టీ సోదరులకు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి నీటిని పంపిణీ చేసిన శివ కుమార్

నల్గొండ జిల్లా మునుగోడు రోడ్డు ఈద్గా నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మంచినీరు పంపిణీ చేయడం జరిగింది.ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది హిందూ ముస్లిం అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో కలిసి ఉండాలని ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించి 1 టౌన్ సీఐ సత్యనారాయణ గారు శాంతియుత సంఘం అధ్యక్షులు ఆఫీస్ ఖాన్ సిఎస్టి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి కనగల్ ఎస్సై రామకృష్ణ వారు మాట్లాడుతూ వేసవికాలంలో మంచినీటి కేన్ద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషనియమని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్వకేట్ మస్యుద్దీన్ నజీరుద్దీన్ ఏర్పుల కామేశ్వర్

 సంఘ నాయకులు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పగడాల శివతేజ కట్టెల మహేష్ 

స్టీరింగ్ కమిటీ నాయకులు చిత్రం శ్రీనివాస్ భాష పాక దుర్గయ్య

 జిల్లా కమిటీ సభ్యులు గంట సుమంత్ రమేష్ అనిల్ నాయక్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ నరేందర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 11 2024, 13:37

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్ జ్యోతిరావు పూలే జయంతి వేడుక ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి

గొప్ప మార్గదర్శి, సంఘసంస్కర్త, సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ,త్యాగశీలి అయిన 

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతిని

 నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో బీసీ సంక్షేమ ఉద్యోగ యువజన మహిళ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో

 ఘనంగా  నిర్వహించి  నివాళులు అర్పించడం అయినది

 ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి,

 బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు  దుడుకు లక్ష్మీనారాయణ,

 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ లు మాట్లాడుతూ

 1827 ఏప్రిల్ 11వ తేదీ న మహారాష్ట్రలోని సతారా గ్రామంలో జన్మించిన జ్యోతిబాపూలే ఆనాటి సమాజంలో ఉన్న అసమానతులకు, వివక్షతలకు, విద్వేషాలకు, అజ్ఞానానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడని

 సమాజం నుండి వీటిని రూపుమాపాలంటే తొలగించాలంటే ప్రజలను విజ్ఞానవంతులు చేయడమే పరిష్కారమని భావించి 

 స్త్రీల కోసం అనేక పాఠశాల నెలకొల్పి వారిని విజ్ఞానవంతులు చేసిన గొప్ప విజ్ఞానవంతుడని

 ముందుగా తన భార్య అయిన శ్రీమతి సావిత్రిబాయి పూలే కు చదువు నేర్పించి 

తద్వారా సమాజంలోని మహిళలకు చదువునందించిన గొప్ప మార్గదర్శి అని

 అదే విధంగా వివక్షతకు, విద్వేషాలకు వ్యతిరేకంగా అనేకమైన గ్రంథాలను రాసి ప్రచురించిన గొప్ప తత్వవేత్త అని

 వారు కొనియాడుతూ మనందరికీ వారు ఆదర్శనీయుడని పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాస ప్రసన్నకుమార్ ,బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, సమాచార సమితి అంజయ్య ,

బీసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ,నల్లబోతు శ్రీనివాస్ యాదవ్, నల్పరాజు వెంకటేశ్వర్లు మరియు బెల్లి నాగరాజు యాదవ్ , చల్ల కోటేష్ యాదవ్, నోముల క్రాంతి కుమార్ యాదవ్, కంభంపాటి కనకయ్య,k. కృష్ణయ్య దూదిగామ స్వామి, బక్కతట్ల వెంకన్న యాదవ్, ఖమ్మంపాటి శంకర్ దుర్గ ,వళ్ళ కీర్తి శ్రీనివాస్, సదానంద్, రుద్ర వెంకటాచారి, కూరెళ్ళ రవీంద్ర చారి ,కర్నాటి ధనుంజయ, పులిపాటి వెంకటయ్య , పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 06 2024, 19:48

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో నల్గొండ 35వ వార్డులో బిజెపి టిఫిన్ బైటెక్ కార్యక్రమం,బిజెపి జండా ఆవిష్కరణ..

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం ఆధ్వర్యంలో నల్గొండ 35వ వార్డులో బిజెపి టిఫిన్ బైటెక్ కార్యక్రమం,బిజెపి జండా ఆవిష్కరణ..

భారతీయ జనతా పార్టీ అల్పాహార సమావేశం( టిఫిన్ బైటెక్ )అనంతరం.భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 35వ వార్డులో బీజెపీ జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం గారి ఆధ్వర్యంలో జెండావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు VHP జిల్లా గౌరవ అధ్యక్షులు కర్నా టి యాదగిరి గారు.శ్యామల తారక్. సురెపల్లి వెంకటేశ్వర్లు. పున్న రామేశ్వర్ .మూడ సైదులు.పొట్టబత్తుల శ్రీను.కైరంకొండ చంద్రశేఖర్.చెరుకు శివశంకర్. గంజి శ్యాంసుందర్ .జువ్వాజి సోమయ్య. తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేయడం జరిగింది.

నిజందాగదుక్షణంఆగదు

Apr 05 2024, 22:05

ఎం ఈ ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా బాబు జగ్జీవన్ జయంతి వేడుక నిర్వహణ..

నల్గొండ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ గారి 116వ జయంతి ఉత్సవాలను ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు మాట్లాడుతూ..

బాబు జగ్జీవన్ రామ్ ఆయన గొప్ప నేత మాజీ ఉప ప్రధాని సుదీర్ఘ కాలం పాటు పేద నిమ్న వర్గాల ప్రజల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేస్తూ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పాటు పడతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లపాక వెంకన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ బుర్ర సుధాకర్ సంఘ నాయకులు ఆది మల్ల మనిరాజు రమణ భార్గవ్ నగేష్ కత్తుల మహేష్ షణ్ముఖ కట్టెల మహేష్ కుమార్ మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ శ్రీకాంత్ నరేష్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 05 2024, 21:57

నలగొండ జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి ఉత్సవాలు...

నల్గొండ జిల్లా కేంద్రా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ జయంతి 116వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ ...

దేశ ప్రజలందరూ మాజీ ఉప ప్రధాని 40 సంవత్సరాలుగా పార్లమెంటరీ మెంబర్గా పనిచేసిన గొప్ప వ్యక్తి జీవితాన్ని త్యాగం చేసి దళిత బహుజన పేద వర్గాల కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షులు మామిడి సైదులు ఎక్స్ కౌన్సిలర్ దుబ్బా అశోక్ సుందర్ మాల మహానాడు జతియ స్టీరింగ్ కమిటీ గాలి సైదులు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగరాణి సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ భాషపాక దుర్గయ్య గంట సుమంత్ పున్న వెంకట్ రమేష్ లలిత నవనీత కీర్తి తదితరులు పాల్గొన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 05 2024, 21:50

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ కోధి నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణ..

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాల మరియు సినిమా ఆటోగ్రఫీ శాఖ మాత్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి హైదరాబాదులోని ఇంటిలో మంత్రి గారి చేతుల మీదుగా శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మగారు గౌరవ అధ్యక్షులు పోచంపల్లి రమణారావు గారు ముఖ్య సలహాదారులు రుద్రాక్షి నరసింహ గారు తదితరులు పాల్గొన్నారు.

7 వ తారీకు ఆదివారం రోజున ఉదయము 10 గంటలకు ఆర్జాల బావి లోని ఇందిరమ్మ కాలనీలో పంచాంగం చేయబడుతుంది అధిక సంఖ్యలో బ్రాహ్మణులు మరియు ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పంచాంగ ఆవిష్కరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడు నని వ్యవస్థాపక అధ్యక్షులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 05 2024, 21:08

కాంగ్రెస్ సామాజిక న్యాయ అజెండా ను తెలంగాణలో ఆచరించడం లేదు: బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్

సార్వత్రిక ఎన్నికల్లో బిసిలకు సీట్ల కేటాయింపు లో జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తాం..

కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కరీంనగర్ స్థానాలను బిసిలకే కేటాయించాలి..

కాంగ్రెస్ సామాజిక న్యాయ అజెండా ను తెలంగాణలో ఆచరించడం లేదు..

బీసీ దళిత ఉద్యమకారులు , ప్రజాస్వామిక శక్తులు, సివిల్ సొసైటీ మద్దతుతోనే రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఈ వర్గాలను విస్మరిస్తే పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో మా తీర్పు ను వెల్లడిస్తాం..

పాంచ్ న్యాయ్ పేరిట మ్యానిఫెస్టో

రిలీజ్ చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని విస్మరిస్తోంది. 

నిజందాగదుక్షణంఆగదు

Apr 04 2024, 08:40

రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం:దాసు సురేశ్, అధ్యక్షులు(BCRS)

రాజకీయాల్లో సామాజిక అన్యాయాన్ని అరికట్టుతాం..

60 శాతం మా జనాభా ఉన్న స్థానాల్లో బీసీలనే పార్లమెంటుకు పంపుతాం..దాసు సురేశ్, అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి 

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని కారణంచేత రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లిచ్చే విషయంలో అన్యాయానికి ఒడిగట్టుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ భుదవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.. బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నిజాం వ్యతిరేఖ పోరాటం మొదలు భారత స్వాతంత్ర పోరాటం నుండి తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటాలలో త్యాగాలు బడుగులవైతే నేటికీ అధికారం,అవకాశాలు కేవలం సంపన్న వర్గాలకు , ఆధిపత్యవర్గాలకే పరిమితమవుతున్నాయని మండిపడ్డారు..

జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం గురించి మాట్లాడే పార్టీలు సహితం తెలంగాణలో పార్లమెంటు సీట్ల కేటాయింపులో సామాజిక అన్యాయానికి పాల్పడుతున్నాయన్నారు. ఈ విషయంపై త్వరలోనే సామాజిక లౌకిక రాజకీయ వాదులు , మేధావులను సమావేశపరచి కొనసాగుతున్న అన్యాయంపై తెలంగాణ వ్యాప్తంగా విస్తృత ప్రచారం గావిస్తామన్నారు.. 

60 శాతానికి పైగా ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల్లో సహితం బీసీలకు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఎప్పుడూ స‌రైన ప్రాతినిధ్యం లభించడం లేదనీ, ప‌వ‌ర్ సెంట‌ర్ కు కావాల‌నే ప్రధాన పార్టీలు బీసీలను దూరంగా నెట్టివేస్తున్నాయని ఆరోపించారు. బీసీ మేలుకో.. రాజ్యాన్ని ఏలుకో నినాద స్ఫూర్తితో బీసీలంతా రాజ‌కీయ పార్టీల‌కు అతీతంగా మెజారిటీ స్థానాల్లో బీసీ అభ్య‌ర్థుల‌కే ఓటు వేసి కనీసం 8 మంది బీసీ ఎంపీల‌ను తెలంగాణ నుంచి పార్ల‌మెంట్ అడుగుపెట్టేలా ఉద్యమిస్తామన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Apr 02 2024, 23:36

సూర్యాపేట జిల్లా: బొప్పారం గ్రామంలో ఘనంగా బొడ్రాయి పునః ప్రతిష్ట..భారీ విరాళం ప్రకటించిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు భాషపంగు నాగేందర్

సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్(s)మండలం, బొప్పారం గ్రామంలో...జరిగిన బొడ్రాయి పునః ప్రతిష్ట కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.. ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, తదితరులు పాల్గొన్నారు..

బొడ్రాయి పునః ప్రతిష్ట కోసం...50116 భారీ విరాళాన్ని ప్రకటించి తోడ్పాటునంధించిన బొప్పారం వాస్తవ్యులు,మలిదశ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు బాషపంగు నాగేందర్ దంపతులకు.. బొడ్రాయి కమిటీ చైర్మన్ గౌరవ శ్రీ నల్లు ఉపేందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.. మునుముందు కూడా గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలని బొడ్రాయి కమిటీ వారు కోరారు. 

ఈ సందర్బంగా బాషపంగు నాగేందర్ మాట్లాడుతూ... గ్రామ అభివృద్ధి, సంక్షేమం కోసం... నా సహాయ సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.

నిజందాగదుక్షణంఆగదు

Mar 31 2024, 20:16

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో సప్త వార్షికోత్సవ పంచాంగం ఆవిష్కరణ

శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ జరుగునని సేవా సంస్థ వ్యవస్థాపకులు సిరి ప్రగడ శ్రీనివాస శర్మ గారు తెలిపారు గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పంచాంగ ఆవిష్కరణ జరుగుతుందని అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పంచాంగ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.ఈ యొక్క పంచాంగ ఆవిష్కరణ ఆర్జల భావి లో నిర్వహించడం జరుగుతుంది ఈ పంచాంగ ఆవిష్కరణకు అధిక సంఖ్యలో ప్రజలు బ్రాహ్మణులు ప్రజా ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమం అనంతరము అన్నదాన కార్యక్రమము నిర్వహించబడును.